పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పవన్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా తెరకేక్కుతుందని సమాచారం.
ఇప్పటికే సినిమా బిజినెస్ కూడా ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలపై శరత్ మరార్, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐతే ప్రస్తుతం పవన్ రీమేక్ సినిమాలపై దృష్టి చూపిస్తున్నాడు. తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతోన్న ధేరి చిత్రం సంభందించి టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా టీజర్ పవన్‌కు తెగ నచ్చేసిందట.
గతంలో ఖుషి, అన్నవరం వంటి చిత్రాలు తమిళంలో విజయ్ చేసినవే. అవి ఇక్కడ మంచి విజయం సాధించాయి. ఐతే మరో సారి ప్రస్తుతం తెరకేక్కితున్న ధేరీ పైన కూడా పవన్ ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు గబ్బర్ సింగ్ సినిమాని పోలి ఉండటంతో ఈ టాపిక్ పవన్ వద్దకు వచ్చిందంటున్నారు. ఐతే ఈ సినిమా రీమేక్‌పై పవన్ దృష్టి పెట్టినట్లు అనుకుంటున్నారు.