- Advertisement -

సర్దార్ కథ ఎంతవరకు వచ్చిందంటే?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎలాగైన ఈ సమ్మర్‍లో రిలీజ్ చేయాలని రెస్ట్‌ లేకుండా ఈ సినిమా షూటింగ్‍లో పాల్గొంటున్నాడు పవన్. బాబీ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు ఈ సినిమా యూనిట్. ఇక ఈ సినిమా షూటింగ్ వివరాల్లోకి వేళితే, ఇటీవలే ఈ సినిమా కేరళలో పవన్-కాజల్‍పై పాటని షూట్ చేశారు. ప్రస్తుతం హైదరబాద్‍లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రికరించనున్నారు.

ఐతే గబ్బర్ సింగ్ సినిమాలో కామెడీ ట్రాక్ మంచి సక్సెస్ అయింది. అలాగే సర్దార్ సినిమాలో కూడా కామెడీ ట్రాక్‍పై ప్రతేక శ్రద్ధ పెడుతున్నారట. పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ రాయ్, సంజనలు కూడా నటిస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -