Sunday, April 28, 2024
- Advertisement -

కుమారికి అవకాశాల వర్షం!

- Advertisement -

అలా ఎలా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మాయి హేభా పటేల్. ఈ సినిమాకి ప్రశంసలు వచ్చిన హేభాకు మాత్రం అంతగా పేరు రాలేదు. సూకుమార్ నిర్మించిన కుమారి 21ఎఫ్ చిత్రంతో హేభా పటేల్‍కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడంతో హేభాకు వరస అవకశాలు వస్తున్నాయి.

తన నటనతో యూత్‍ను ఫిదా చేసింది ఈ ముద్దు గుమ్మ. ప్రస్తుతం ఈ భామకు వసర అవకాశాల వశ్షం కురుస్తుంది.  మంచు విష్ణు-రాజ్ తరుణ్ లు ఇద్దరూ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ సినిమాలో రాజ్ తరుణ్ తో మరోసారి జత కడుతోంది హేభా పటేల్. ఈ సినిమాకి జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు.

అలాగే చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో మోహన్ లాల్-గౌతమి నటిస్తున్న చిత్రంలోనూ హేభా నటించబోతుంది. పలు భాషల్లో రూపు దిద్దుకుంటున్న ఈ సినిమాని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే శర్వానంద్ హీరోగా పి. మహేష్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా హేభానే తీసుకోనున్నారు అని తెలుస్తుంది. అలాగే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా హేభా నటించబోతుందట. ఇలా కుమారి 21ఎఫ్ చిత్రం హేభాకు చాలా ఉపయోగపడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -