తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వైఎస్ జగన్‌కి రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం జగన్ వెంట నడిచే సమయంతో త్వరలోనే ఉందని జగన్ మద్దతుదారులైన సినిమా జనాలు అంటున్నారు. ఆ విషయం ఎలా ఉన్నా బాబు కొమ్ము కాసేవాళ్ళను పక్కనపెడితే ఇతర సినిమా పెద్దలందరూ కూడా వైఎస్ జగన్‌కి బహిరంగంగా మద్దతివ్వడానికి ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. గల్లా జయదేవ్ కుటుంబంతో బంధుత్వం ఉన్నప్పటికీ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన సూపర్ స్టార్ కృష్ణ సైతం వైఎస్ రాజశేఖరరెడ్డి మంచితనం గురించి వేనోళ్ళ ప్రశింసించాడు. ఇక వైఎస్ జగన్‌కే తన మద్దతు అని 2019లో జగన్ విజయం సాధించడం ఖాయం అని చెప్పాడు కృష్ణ.
ఇక తాజాగా మంచు హీరో విష్ణువర్థన్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశాడు. జగన్ పాదయాత్ర అసామాన్యం అని …….ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి మండుటెండలో పాదయాత్ర చేస్తున్న జగన్ గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పాడు విష్ణు. 2019 ఎన్నికల్లో జగనే గెలుస్తాడని అభిప్రాయపడ్డాడు. మంచు మోహన్‌బాబు ఏ పార్టీలో చేరబోతున్నాడు అన్న ప్రశ్నకు ఆ రకంగా స్ట్రెయిట్‌గా సమాధానం ఇచ్చాడు మంచు విష్ణు. మంచు వారి మద్దతు చిత్తూరు జిల్లాలో కచ్చితంగా జగన్‌కి ఉపయోగపడడం ఖాయం. విద్యాసంస్థలతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలకు చాలా సేవా కార్యక్రమాలు చేశాడు మోహన్ బాబు.
ఇక తటస్థులైన ఇతర సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా త్వరలోనే గ్రూప్‌గా వెళ్ళి జగన్‌ని కలిసి జగన్‌కి మద్దతు తెలపనున్నారు. జగన్‌కి మద్దతు తెలిపితే అవకాశాల విషయంలో ప్రభావం ఉంటుందన్న విషయం తెలిసినా…….బాబు భజన మీడియా మొత్తం ఇక టార్గెట్ చేసి మరీ నెగిటివ్ వార్తలు రాస్తుందన్న విషయం తెలిసినా సరే……..అలాంటివాటికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి జగన్‌కి మద్దతు తెలుపుతుండడంపై జగన్ మద్దతుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరోవైపు భజన మీడియా పెద్దలతోపాటు సినిమా ఇండస్ట్రీ పెద్దలతోనూ జగన్‌కి సినిమా ఇండస్ట్రీ జనాల సపోర్ట్ లేకుండా చేయడం ఎలా అన్న విషయంపై చంద్రబాబు వ్యూహాలు రచ్చిస్తున్నారని సినిమా ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారు.
