Wednesday, May 15, 2024
- Advertisement -

విజయ్ మాల్యా-ముఖ్యనేత బంధం….. సాక్ష్యాలివిగో అంటున్న నేషనల్ మీడియా

- Advertisement -

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి బ్యాంకులను దివాలాతీయించి వేల కోట్ల రూపాయాలతో చెక్కేసిన విజయ్ మాల్యాతో సంబంధం ఉంది అంటే అది ఎలాంటి సంబంధం అయి ఉంటుంది. అది ఎలాంటి సంబంధమో ప్రతిపక్ష నాయకుడు తీవ్రస్థాయి ఆరోపణలు చేశాడు. అయితే ముఖ్యనాయకుడితో సహా అధికార పార్టీ నేతలెవ్వరూ కూడా ఆ నాయకుడి ఆరోపణలకు సమాధానం చెప్పినవాళ్ళు లేరు. కానీ ప్రత్యారోపణలు మాత్రం ఘాటుగా చేశారు.

అయితే ఇప్పుడు విజయమాల్యాతో ముఖ్యనాయకుడి బంధం నేషనల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ అయింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే రాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ఓటములతో ఏం సంబంధం? ఆ ముఖ్యమంత్రికి సంబంధించిన పార్టీ కూడా అక్కడ పోటీ చేయడం లేదు. అలాంటప్పుడు అక్కడ తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ని గెలిపించడానికి ఆ నాయకుడు తాపత్రయపడడం ఏంటి? ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బంధం ఏంటి? ఇక సదరు విజయమాల్యా కూడా చేసిన అక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడే చేశాడన్నది నిజం. ఆ సమయంలో ఆయనగారి దర్జా అంతా ఇంతా కాదు. అయితే బిజెపి ప్రభుత్వం వచ్చాక మాత్రం ఆస్తులన్నీ వదిలేసి దేశం వదిలేసి దొంగతనంగా పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తం విషయాలపై సాక్ష్యాధారాలతో సహా జాతీయ స్థాయి జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. తన ప్రత్యర్థి నాయకుడిని జైలుకు పంపించడం కోసం కాంగ్రెస్‌తొ ఆ నాయకుడు కుమ్మక్కయ్యాడన్న ఆరోపణలు ఇప్పటివి కావు. ఇప్పుడు కూడా బయటికి వేరే పార్టీని ఓడించడం కోసమే అన్న కలరింగ్ ఇస్తున్నప్పటికీ తెరవెనుక మాత్రం కాంగ్రెస్ గెలుపు కోసమే ప్రయత్నాలు చేశారన్నది నిజం.

అన్నింటికీ మించి ఇంకో కారణం కూడా బలంగా వినిపిస్తోంది. విజయమాల్యాను రాజ్యసభకు రెండు సార్లు పంపించింది జేడీఎస్‌నే. అందులో ఒక పర్యాయం కాంగ్రెస్ పార్టీ కూడా మాల్యాకు మద్దతిచ్చింది. విజమాల్యాకు బిజెపితో కూడా సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ తనను దేశం విడిచి పారిపోయేలా చేసింది బిజెపినే అని మాల్యా కోపంగా ఉన్నాడట. అందుకే తనకు ముఖ్యనేతతో పాటు సన్నిహితంగా ఉన్న ఇతర నేతల సపోర్ట్ కూడా తీసుకుని బిజెపిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలూ చేశాడట. అయితే చేసేది చెప్పడు……చెప్పింది చెయ్యడు, మాటలు ఒకలా ఉంటే చేతలు ఒకలా ఉంటాయి అన్న పేరు తెచ్చుకున్న సదరు ముఖ్యనేత మాత్రం బిజెపిని ఓడించాలి అన్న నెపంతో విజయమాల్యా కోసం కాంగ్రెస్, జేడీఎస్‌లకు అనుకూలంగా రాజకీయం చేశాడన్న చర్చ ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ హాట్‌గా నడుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -