యంగ్‌టైగర్ ఎన్టీఆర్,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్నేహం రోజు రోజుకి బలపడుతుంది.దీనికి సాక్ష్యంగా ఎన్టీఆర్ గత రాత్రి తన ట్విట్టర్ అకౌంట్లో రామ్ చరణ్ ఫోటో పోస్ట్ చేశాడు. నట దిగ్గజం స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో కింద రామ్ చరణ్ కూర్చుని ఉన్న స్టిల్ అది. ‘మహానుభావుల ఆలోచనల నుంచి ప్రేరణ’ అంటూ ఓ కాప్షన్ ఉంచాడు.
ఇక వీరిద్దరు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమాలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.అప్పటి నుంచి తరచూ పార్టీలు, ఫోటోలతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.ఎన్టీఆర్,త్రివిక్రమ్ డైరెక్షన్లో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు.ఇక రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వగానే ఇద్దరు రాజమౌళి సినిమాకు షిఫ్ట్ అవుతారు.
Provoked by LEGENDARY thoughts pic.twitter.com/GvUj6XC4Ra
— Jr NTR (@tarak9999) June 8, 2018
