టాలీవుడ్లో ఈ మధ్య విడాకుల హడావిడి ఎక్కువుగా కనిపిస్తుంది.దర్శకుడు క్రిష్ తన వివాహ బంధానికి గుడ్‌బై చెప్పి విడాకులు తీసుకుంటున్నాడన్న వార్త బయటికి వచ్చిన దగ్గర నుండి నిత్యం ఏదో జంటపై విడాకుల రూమర్స్ వస్తున్నాయి.అయితే గత వారం రోజులుగా మంచు వారబ్బాయి మనోజ్ తన భార్య నుండి విడాకుల తీసుకుంటున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.విడాకులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలు నిజాలు కావని స్పష్టం చేశాడు.
ఈ వార్తను మనోజ్ దగ్గర ప్రస్తావించాడు ఓ ట్విట్టర్ అభిమాని.దీనికి సమాధానంగా మనోజ్… ‘వాళ్ల బొంద రూమర్స్ పుట్టించేవాళ్లకు ఏం తెలుసు మా గురించి’ అని ఖండించారు. అంతే కాకుండా ‘ 2010 నుండి ప్రణతి నా జీవితంలో అడుగు పెట్టింది.. నా గుండె ఆగిపోయేంతవరకు తనే నా దేవత అంటూ’ బదులిచ్చాడు.
2010 nunchi thanu na jeevitham lo adugu pettindhi … Na gunde aggipoye antha varaku thane na Devatha 🙂 🙏🏻❤️ https://t.co/BQIE6IsjB5
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 8, 2018