తమిళ హీరోలు అయిన సూర్య,కార్తీ అన్నదమ్ములు అన్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరికి తమిళంతో సమానంగా తెలుగులో కూడా మార్కెట్ ఉంది.వీళ్లు తీసే ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది. కార్తీ హీరోగా నటించిన చిన్నబాబు సినిమా ఆడియో ఫంక్షన్కు ముఖ్య అతిధిగా వచ్చాడు సూర్య. ఈ సందర్భంగా సూర్య తన తమ్ముడి గురించి మాట్లాడుతూ..కార్తీని చూస్తే తనకు చాలా గర్వంగా ఉందని అంటున్నాడు సూర్య. ఎప్పుడూ తమ్ముడిని పెద్దగా పొగడని సూర్య.. అతడి కొత్త సినిమా ‘చినబాబు’ ఆడియో లాంచ్ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు.
ఒక సామెత ఉంటుందని చెబుతూ.. తోడుగా ఒక సోదరుడు ఉంటే పెద్ద సైన్యాన్నయినా ఓడించవచ్చని.. తనకు కార్తి అలాంటి సోదరుడే అని సూర్య అన్నాడు. అతడి సినిమాల ఎంపిక చూస్తే తనకు గర్వంగా అనిపిస్తుందని.. వైవిధ్యమైన సినిమాలతో సాగిపోతున్నాడని సూర్య చెప్పాడు.కార్తి మాట్లాడుతూ.. ఇది ఎంతో ప్రేమతో చేసిన సినిమా అన్నాడు. ఈ సినిమాతో మళ్లీ రైతును హీరోగా మార్చామని.. తాను ఇందులో రైతుగా నటించానని.. తాను చాలా గర్వించే పాత్ర ఇదని చెప్పాడు. సినిమాలో హీరోయిన్గా సాయేషా కథానాయికగా నటించింది
