Tuesday, May 14, 2024
- Advertisement -

మ‌రో 10 మంది ఎమ్మెల్యేల‌ను ఆ పార్టీలోకి తీసుకువెళ్తున్న గంటా?

- Advertisement -

గంటా శ్రీనివాస‌రావు ఏ పార్టీలో ఉన్నా ఎమ్మెల్యేగా గెలిచే స‌త్తా ఉన్న నాయ‌కుడు. మ‌రి అలాంటి నేత వ‌చ్చే ఎలెక్ష‌న్స్‌కు మ‌రో పార్టీలోకి మారాడానికి రంగం సిద్ధం చేసుకున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. గంటా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర మంత్రి. కానీ మొన్నజ‌రిగిన కేబినెట్ మీటింగ్ కు ఆయన గైర్హాజరు అయ్యారు. గంటాకు చంద్ర‌బాబుతో చెడింది అనే వార్తలు వచ్చాయి.ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కేబినెట్ మీటింగ్ ఎగ్గొట్టడంతో అనుమానాలు బలపడ్డాయి.

గంటా పార్టీ మార‌డం ఇది కొత్త కాదు. గ‌తంలో ఆయ‌న కాంగ్రెస్ నుండి పీఆర్పీలోకి… పీఆర్పీలో నుండి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ నుండి మ‌ళ్లీ తెలుగుదేశంలోకి ఆయ‌న వ‌రస‌గా పార్టీలు మారారు. అయితే గంటా పార్టీ మారిన ప్ర‌తిసారి విజ‌యం సాధించడం ఇక్క‌డ మ‌రో విశేషం. 2019 ఎలెక్ష‌న్స్ నాటికి గంటా పార్టీ మార‌డం ఖ‌యంగా క‌నిపిస్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల లోపు ఆయ‌న టీడీపీని వదిలేయడమే మంచిదని గంటా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గంటాకు మొద‌టి నుండి చిరంజీవి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గంటా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌తో చ‌ర్చ‌లు న‌డుపుతున్నార‌ని స‌మాచారం.

ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో సామాజికవర్గ పరంగా బలంగా ఉన్న గంటా తనకు దగ్గరయిన కుటుంబ పార్టీ అయిన జనసేనలో చేరితే బాగుంటుందని భావిస్తున్నారట. గంటా త‌న‌తో పాటు మ‌రో 10 మంది నేత‌ల‌ను జ‌న‌సేన పార్టీలోకి తీసుకువ‌స్తాన‌ని ప‌వ‌న్‌కు మాటిచ్చినట్లు తెలుస్తుంది.ఈ నేప‌థ్యంలోనే గంటా ఆనంతో భేటీ అయ్యార‌ని స‌మాచారం.ఇంకో విషయం ఏంటంటే… నాదెండ్ల మనోహర్ పవన్ భేటి వెనుక కూడా గంటా శ్రీనివాసరావు ఉన్నట్లు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -