తమిళ బిగ్‌బాస్‌పై రోజు రోజుకి నిరసన సెగలు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటి వరకు బిగ్‌బాస్ సెట్టింగ్ దగ్గర నుండి షో నిర్వహించే వరకు మొత్తం ముంబాయికి చెందిన వాళ్లేనని తమిళనాడు సినీ కార్మికులు ధర్నా చేశారు. తాజగా మరో వివాదంలో చిక్కుకుంది తమిళ బిగ్‌బాస్. బిగ్‌బాస్ షో అశ్లీలంగా, ఉందని పచ్చిబూతులు మాటలు, వ్యవహారాలు నడుస్తున్నాయని హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. హిందూ సంఘాలు టీవీ యాజమాన్యానికి, కమల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హిందూ సంస్కృతిని, తమిళుల కుటుంబ విలువలను మంటగలుపుతున్న ఈ షోను నిలిపేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. సినిమాలకు సెన్సార్ ఉంటుంది కాని ఇలాంటి షోలకు సెన్సార్ లేకపోవడం దారుణ అంటున్నారు. మరి దీనిపై కమల్ ,బిగ్‌బాస్ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
