సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల హడావిడి నడుస్తుంది.సినీ తారల జీవిత కథలతో పాటు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథలను కూడా సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసింది.అయితే మహిళ క్రీడకారుల జీవితాలను సినిమాలగా చాలా తక్కువుగా తెరకెక్కించారనే చెప్పాలి.మేరికోమ్,దంగల్ సినిమాలలో మాత్రమే మహిళ జీవిత కథలను సినిమాగా తీశారు.తాజాగా టీంఇండియా మహిళ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ పట్టాలెక్కబోతోందనే వార్తలు వినబడుతున్నాయి.ఈ విషయాన్ని మిథాలీ రాజ్ దగ్గర ప్రస్తావిస్తే నిజమేనని చెప్పుకోచ్చింది.వయాకామ్ 18 సంస్థ బయోపిక్ కోసం తనను సంప్రదించినట్లు తెలిపారు.
ఇందుకు తానూ ఒప్పుకున్నానని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.అయితే తన జీవిత కథలో హీరోయిన్గా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని మిథాలీ అభిప్రాయపడింది.ప్రియాంక చోప్రా నా వ్యక్తిత్వానికి దగ్గర ఉండే మనిషి అని అందుకే ఆమె అయితే బాగుంటుందని మిథాలీ తెలిపింది.అయితే ఇది నా అభిప్రాయం మాత్రమే అని, నా బయోపిక్‌లో ఎవరు నటించాలి అనే విషయాన్ని చిత్రబృందానికే వదిలేస్తున్నాను.