Sunday, May 11, 2025
- Advertisement -

అస్త్ర శస్త్రాలు రె”ఢీ“

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. ఆ తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ భేటీ అవుతుంది.సమావేశాల్లో చర్చకు చేపట్టాల్సిన అంశాలు, సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు దాదాపు 45 రోజుల పాటు జరిగే అవకాశాలున్నాయి. 

మహారాష్ట్ర ప్రభుత్వంతో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల ఒప్పందాన్ని కుదుర్చుకుని జోష్ మీద ఉన్న కేసీఆర్ ప్రభుత్వం.. ఈ అంశంతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి వందరోజుల మాస్టర్ ప్లాన్, డబుల్ బెడ్ రూం ఇళ్ల స్కీము తదితర అంశాలపై సవివరంగా చర్చించాలని భావిస్తోంది.

అటు విపక్షాలూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. రైతుల రుణమాఫీ, విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై సర్కారుపై దాడికి సమాయత్తమవుతున్నాయి. పైకి వాడివేడిగా సాగేట్లు కనిపిస్తున్నా.. పాలక పక్షం బాగా బలంగా ఉన్న నేపథ్యంలో.. సమావేశాలు ఏకపక్షంగా.. ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా సాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -