పవర్ స్టార్ పవ్న్ కళ్యాణ్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా ఆడియో ఈ నెల 20 న రిలీజ్ చెయనున్నారు. ఈ వేడుకకు అన్నయ్య చిరంజీవిని పిలవాలా లేదా? అనే విషయంలో పవన్ ఇంకా ఏవిధమైన నిర్ణయం తీసుకోలేదని టాక్. ఐతే కొన్నేళ్లుగా పవన్ ఆడియో ఫంక్షన్లకు చిరంజీవి రావడం లేదు.
పవన్ కూడా చరణ్, బన్నీ సినిమాల ఆడియో వేడుకలకు వెళ్లడం లేదు. ఐతే ఈ మధ్య మాత్రం అన్నదమ్ములిద్దరూ మళ్లీ కలిసిపోయారు. సర్దార్ సెట్స్‌లో చిరు వచ్చి సందడి చేయడం ఇలాంటివి జరిగిన విషయం తెలిసిందే. పవన్ కూడా బ్రూస్ లీ విడుదల తరవాత స్వయంగా అన్నయ్య ఇంటికి వెళ్లి.. కలిసొచ్చాడు.
ఇదంత చూసిన వారికి అన్నదమ్ములిద్దరూ మళ్లీ కలిసిపోయారని అనుకున్నారంతా.. సో సర్దార్ ఆడియో వేడుకకు చిరు వస్తాడు అనుకున్నారంతా. ఐతే పవన్ మాత్రం తన ఆడియో వేడుకకు ఎవ్వరినీ పిలవకూడదని అనుకుంటున్నాడట. సో మరి పవన్ చిరుని పిస్తాడో లేదో చూడాలి. చిరు వస్తే మాత్రం అది మెగా అభిమానులకు పండగే!
