అందల భామ అనుష్కకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు రకరకల పాత్రలో నటించి అందరిని అలరించింది. ప్రస్తుతం ఈ భామ బాహుబలి ది కన్‍క్లూజన్‍లో నటిస్తూ బిజీగా ఉంది. ఐతే ఈ భామకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటుందట.
అలాగే ప్రతి అమ్మాయికి కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం తల్లిదండ్రులు ఇవ్వాలి అంటుంది. నాకు మనసుకు నచ్చిన పని చేస్తా నచ్చకపోతే అసలు చేయను అంటుంది. నాకు నేనుగా సినిమాలోకి వచ్చాను ఇక్కడికి వచ్చాక నా మనసుకి చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి అమ్మాయి తనకు తను మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని చెపుతుంది.
అలాగే ప్రతి మనిషికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వాటి మనం గౌరవించాలి అంతే తప్ప అలా చేస్తే తప్పు ఇలా చేస్తే తప్పు అనకుడదు. అలా ఎవరైన అంటే నాకు ఊపిరాడదు. నా మనసుకు ఎలానో ఉంటుంది మరింత బిగుసుకుపోతా. నా చూటూ ఎప్పుడు అలా ఉండటం నేను ఇష్టపడను. ఒక వేళ నేను పెళ్లి చేసుకోవాలనుకొంటే నా నిర్ణయలను, నా అభిప్రాయాలను గౌరవించే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అని చెపుతుంది అనుష్క
