Friday, May 3, 2024
- Advertisement -

ఫేస్ బుక్‍లో ఏ హీరోయిన్ నెంబర్ వన్ అంటే?

- Advertisement -

కాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫాలోవర్స్‌, లైక్స్‌తో రికార్డ్స్ కొడుతున్నారు. అభిమానులకు కూడా తమ అభిమాన నటి సోషల్ మీడియాలో ఏ స్థానంలో ఉందో తెలుసుకోవాలి అని ఆశపడుతుంటారు. తారల మధ్య మూవీస్ లో నంబర్ వన్ పొజిషన్ కోసం గట్టి పోటీ ఉండేది. ఇప్పుడు అలా కాదు. హీరోయిన్స్ చూపు నెట్ వర్క్ మీద పడింది.

సోషల్ నెట్ వర్క్‌ మీడియాలో ఎవరు ఎక్కువ లైక్స్ సంపాదిస్తే వారే నంబర్ వన్ అవుతున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకి ఫేస్ బుక్ లో కోటి అభిమానులు ఉన్నారట. ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ భామే కాక కాజల్, శృతి హాసన్, సమంత వంటి వారు కూడా సోషల్ మీడియాలో హల్ చల చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో మొదటిస్థానంలో కాజల్ ఉండగా, ఆ తర్వాత స్థానంలో శృతి హాసన్ ఉంది. శృతి తర్వాత స్థానంలో ఇంతకు ముందు సమంత ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలోకి తమన్నా వచ్చి చేరింది. సో ఇప్పుడు తమన్నా తర్వాత స్థానంలోకి సమంత వచ్చి చేరింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -