- Advertisement -
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన రాకను పురస్కరించుకొని ఆయన అభిమానులు స్వాగతాలు పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల విషయంలో జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.
భీమవరం చినఅమిరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను పంచాయతీ సిబ్బంది తొలగించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఫ్లెక్సీలు తొలగించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కల్పించుకుని ‘జనసేన’ కార్యకర్తలకు సర్దిచెప్పారు. మరోవైపు పవన్ బస చేసిన ఫంక్షన్ హాలు వద్దకు భారీగా అభిమానులు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఓ అభిమానికి తీవ్ర గాయాలు అయ్యాయి.