Saturday, May 18, 2024
- Advertisement -

ఇంగ్ల‌డ్ గ‌డ్డ‌పై కోహ్లీ త‌న స‌త్తా చూపించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది…

- Advertisement -

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఆటగాడిగా, కెప్టెన్‌గా రికార్డుల మీద రికార్డులు అతడి సొంతం. తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఇంగ్లండ్‌ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై బుధ‌వారం నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి త‌న బ్యాటింగ్ స‌త్తా చూపిస్తాడ‌ని జ‌ట్టు కోచ్ ర‌విశాస్త్రి తెలిపారు.

2014లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో 13.50 సగటుతో కేవలం 134 పరుగులు చేసి కోహ్లి తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే అప్పటికీ, ఇప్ప‌టికీ బ్యాటింగ్‌లో ఎంతో ప‌రిణితి సాధించారు కోహ్లీ. 2014 పర్యటనలో మొత్తం ఐదు టెస్టులాడిన కోహ్లి.. వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులతో ఘోరంగా విఫలమయ్యాడు.

నాలుగేళ్ల క్రితం విరాట్ కోహ్లి ఇక్కడ టెస్టుల్లో విఫలమయ్యాడు. కానీ.. ఆ తర్వాత బ్యాటింగ్‌కి మెరుగులు దిద్దుకుని.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -