Sunday, May 11, 2025
- Advertisement -

కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన కేసీఆర్‌..

- Advertisement -

మిషన్ కాకతీయ ద్వారా మన చెరువులను బాగు చేసుకున్నామని, 365 రోజులు చెరువుల్లో నీరు ఉండేలా ఏర్పాటు చేసుకున్నామని, మళ్లీ మన తెలంగాణ చెరువుల్లో ఎర్ర రొయ్యలు పుట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ లో ‘కంటి వెలుగు’ను ఆయన ప్రారంభించారు.

యావత్ దేశంలో ఇలాంటి పథకం లేదని చెప్పారు. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు ఒక్కరూపాయి కూడా చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. దృష్టిలోపాలు ఉన్నవారికి కళ్లజోళ్లు ఇవ్వడంతోపాటు.. అవసరమైనవారికి ఆపరేషన్లు కూడా ఉచితంగానే చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే 40 లక్షల కళ్లజోళ్లు సిద్ధం చేసినట్లు కేసీఆర్ తెలిపారు. 3.7 కోట్ల మందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని ఆయన వెల్లడించారు.

మల్కాపూర్ నుంచి నేను ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మల్కాపూర్‌కు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. రాష్ట్రానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని మల్కాపూర్ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆడ, మగ అంతరాలు కేవలం మన దేశంలోనే ఉన్నయి. అవకాశాలిస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మల్కాపూర్ గ్రామాభివృద్ధికి కేసీఆర్ ఆరుకోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. వచ్చే జూన్ నాటికి గ్రామానికి గోదావరి నీళ్లని అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

అంతేగాక, ‘ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తాం. ఇప్పటికే 40 లక్షల కళ్లద్దాలను తెప్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా 825 బృందాలను నియమించాం. స్వయంగా నేనే కొందరికి కళ్లద్దాలు అందజేశాను. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోం చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించారు.

గతంలో రాష్ట్రంలో ఎన్నో బాధలు పడ్డామని, కష్టాలు పడి పంటలు వేస్తే.. బోరు పడేదు కాదు, విద్యుత్ సరఫరా ఉండేది కాదని, రైతులు బాధలు పోగొట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ బాధలు పోవాలంటే గోదావరి, కృష్ణా నీరు మనకు అందాలని, బంగారు తెలంగాణ దిశగా మనం పయనించాలని కేసీఆర్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -