Wednesday, May 1, 2024
- Advertisement -

ఈ తెలంగాణ మంత్రి గారంటే సినిమా వాళ్లు పడి చస్తున్నారు!

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మంత్రుల గ్లామర్ పెరిగింది. వీరికి గ్లామరస్ సినిమా వాళ్ల మధ్యనే క్రేజ్ కనిపిస్తోంది. సాధారణంగా రాజకీయ నేతలే సినిమా వాల్లతో కనిపించడానికి మోజును చూపిస్తే..

రివర్స్ లో తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల పట్ల సినిమా వాళ్లకు క్రేజ్ కనిపిస్తోంది. ముందుగా కేటీఆర్ సినిమా వాళ్ల మధ్య వెలిగిపోవడం మొదలవ్వగా ఇప్పుడు.. తలసాని శ్రీనివాసయాదవ్ కు కూడా సినిమా వాళ్లలో అదే ఆదరణ కనిపిస్తోంది.

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కేటీఆర్ కు క్రేజ్ పెరిగింది. కేటీఆర్  కు పేజ్ త్రీ ప్రోగ్రామ్స్ కు ఆహ్వానాలు అందడం మొదలైంది. కేటీఆర్ తమ కార్యక్రమాలకు వస్తే చాలన్నట్టుగా చాలా మంది వ్యవహరించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ కూడా విమర్శలు చేసింది. కేటీఆర్ సినిమా హీరోయిన్లతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంలో బిజీగాఉన్నాడంటూ రేవంత్ రెడ్డి వంటి వాళ్లు విమర్శలు చేశారు.

మరి కేటీఆర్ సంగతి అలా ఉంటే.. తెలంగాణలో ఇప్పుడు తలసాని శ్రీనివాసయాదవ్ కు క్రేజ్ పెరిగింది. తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా గెలిచి.. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మంత్రి పదవి ని చేపట్టిన ఈ యన చుట్టూ సినిమా వాళ్లు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎందుకిలా అంటే.. ఆయన తెలంగాణకు సినిమాటోగ్రఫీ మంత్రి కావడమే కారణం అని చెప్పవచ్చు. మా అద్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ నుంచి అనేక మంది వెళ్లి తలసానిని కలుస్తున్నారు. మేము మీ అభిమానులం అని చెప్పుకొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంచేపట్టిన కార్యక్రమాల్లో తాము పాలుపంచుకొంటామని చెబుతున్నారు.

ఇక సినిమా ఆడియో విడుదల వేడులకు తలసానిని ఆహ్వానించే వాళ్లు ఎంతో మంది కనిపిస్తున్నారు. ఇలాంటి క్రేజ్ కంతటికీ కారణం.. ఆయన సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కావడమే కారణమని వేరే చెప్పనక్కర్లేదు. మొత్తానికి పార్టీ మారడంతో ఆయన టైమ్ సూపర్ గా ఉన్నట్టుంది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -