తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్లో ఓ చిన్న సెలబ్రిటీగా ఆడగుపెట్టిన కౌశల్ ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించాడు.బిగ్‌బాస్ రెండో సీజన్ ప్రేక్షకులు చూస్తున్నారంటే దానికి కారణం కౌశల్.తోటి హౌస్మెట్స్ అతనిని ఎంత టార్గెట్ చేసి విమర్శిస్తున్న సహనం కోల్పొకుండా కౌశల్ ఆడుతున్న గేమ్ అందరికి నచ్చడంతో, అతనికి బయట భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.బయట అతని పేరిట కౌశల్ ఆర్మీ అని ఓ గ్రూప్‌ను క్రియేట్ చేసి అతనికి మద్దతు తెలుపుతున్నారు.ఇటీవలే కౌశల్ ఆర్మీ,హైదరాబాద్,విజయవాడలలో కౌశల్‌కు సపోర్టుగా భారీ ర్యాలీలు నిర్వహించారు.ఇక కౌశల్ బిగ్‌బాస్ విన్నర్ అవుతాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
కౌశల్‌కు ఉన్న క్రేజ్ కారణంగా అతనికి సినిమాలలో కూడా అవకాశాలు వచ్చేలా ఉన్నాయి.తాజాగా తెలుగు సినిమాల మాస్ స్పెషలిస్ట్ దర్శకుడైన బోయపాటి శీను కౌశలతో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.కమర్షియల్ సినిమాలు తీయాలంటే బోయపాటి తరువాతే ఎవరైనా.బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే కౌశల్‌తో సినిమా ఉంటుందని సమాచారం.అయితే బోయపాటి కౌశల్‌ను హీరోగా పెట్టి సినిమా తీస్తాడా? లేక తన సినిమాలలో ఓ మంచి రోల్ ఇస్తాడో చూడాలి.ఏది ఏమైన గాని కౌశల్ మాత్రం బోయపాటి సినిమాలో కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది.