Sunday, May 19, 2024
- Advertisement -

సెన్సార్ కి ముస్తాబైన ‘సకళ కళా వల్లభుడు’

- Advertisement -

ఇటీవలే ఐటెమ్ సాంగ్ విడుదల చేసిన ‘సకళ కళా వల్లభుడు’ సినిమా టీం బుధవారం మరో పాటను యూ ట్యూబ్ ద్వారా రిలీజ్ చేయనుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకు ముస్తాబవుతున్న ఈ మూవీని సింహ ఫిల్మ్స్, దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువ దర్శకుడు శివగణేశ్ దర్వకత్వం వహిస్తున్నారు. తనిష్క్ రెడ్డి, మేగ్లాముక్త హీరో హీరోయిన్లకు పరిచయమవుతున్నారు. ఈ కొత్తజంట మధ్య రొమాన్స్, లవ్, యాక్షన్ సీన్స్ బాగా వచ్చాయని, వీరి మధ్య కెమిస్ట్రీ వెండితెరపై బాగా పండుతుందని చిత్రయూనిట్ చెబుతోంది. పూర్తి కమర్షియల్ హంగులతో గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘సకళ కళా వల్లభుడు’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడని దర్శకుడు శివగణేశ్ ఆద్య మీడియాతో తెలిపారు. ఇటీవలే వినాయక చవితి కానుకగా విడుదల చేసిన ఐటెమ్ సాంగ్ మంచి ఆదరణ పొందుతోందని సంతోషం వ్యక్తం చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో డీజే సాంగ్ గా, తమ ‘సకళ కళా వల్లభుడు’లోని ‘తిక్కరేగిన వంకరగాళ్లు…మట్టికొట్టిన పోకిరివీళ్లు…సకళ కళా వల్లభులు వీరేనయ్యా’…అంటూ సాగిన ఐటెమ్ సాంగ్ దుమ్మురేపేసిందని తెలిపారు. యూ ట్యూబ్ లో ఇలా విడుదల కాగానే లక్షల వ్యూస్ తో ట్రెండింగ్ కావడంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. గీతామాధురి పాడిన ఆ పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ తమలో నూతనుత్సాహం నింపిందని నిర్మాతలు అనిల్ కుమార్, కిశోర్, త్రినాథ్, శ్రీకాంత్ చెప్పారు. అదే ఉత్సాహంతో బుధవారం రెండో పాటను, త్వరలో టీజర్ ను యూ ట్యూబ్ ద్వారా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ‘ఆంధ్ర తెలంగాణ అల్లుడే వీడు…హార్సుల దూకాడు. నాటుగ స్వీటుగ అల్లరే వీడు…యమ హాటుగ ఉన్నాడు’…. అంటూ సాగే పాట మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. 

పెద్ద హీరోల సినిమాలకు ధీటుగా తమ ‘సకళ కళా వల్లభుడు’ పాటలు, ఫైటులతో ఆకట్టుకుంటాడని, ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీకి మరో మాస్ హీరో లభించినట్టేనని చెప్పారు. ఈ విషయం తాము చెబుతున్నది కాదని, ఇప్పటికే రష్ చూసి పలువురు సినీ ప్రముఖులు చెప్పిన మాటని దర్శకుడు శివగణేశ్, నిర్మాత అనిల్ తెలిపారు. సినిమా హక్కుల కోసం మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయన్నారు. హీరో విలన్ మధ్య సన్నివేశాలు సంక్రాంతి బరిలో నిలిచిన పందెంకోళ్ల పోరును తలపిస్తాయని చెప్పారు. థర్టీ ఇయర్స్ పృథ్వీ కామెడీ మేనరిజం నవ్వులు పండిస్తుందన్నారు. సీనియర్ నటులు సుమన్, చిన్నా, జీవా, అపూర్వ, శృతి, ప్రభావతి, విశ్వ తదితరులు నటించారు. తమ ‘సకళ కళా వల్లభుడు’ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందించగా గిరిధర్ నాయుడు పాటలు రచించారు. కెమేరా సాయిచరణ్, గరుడవేగ ఫేం ఎడిటర్ ధర్మేంధ్ర పనితనం తమ చిత్రానికి అదనపు ఆకర్షణ అని చెప్పారు. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో బిజీగా ఉన్న ‘సకళ కళా వల్లభుడు’కు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన శివగణేశ్ తో సహా చిత్రయూనిట్ అంతా ఈ సినిమా పక్కా హిట్ సినిమాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -