బిగ్‌బాస్ రెండో సీజన్‌లో సోమవారం నుంచి గొడవలు ఎక్కువైయ్యాయి.కౌశల్‌ను టార్గెట్ చేస్తు మిగిలిన ఇంటి సభ్యులు కామెంట్స్ చేస్తున్నారు.హౌస్‌మెట్స్ అందరు ముకుమ్మడిగా కౌశల్‌పై మాటల యుద్దానికి దిగుతున్నారు.కౌశల్ కూడా సహనం కోల్పోయి వారిని కుక్కలు అనడం మనం చూస్తునే ఉన్నాం.బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో పెద్ద వార్ నడిచింది.గీతామాధురి కౌశల్‌తో మాట్లాడుతు…కౌశల్ కూతురు ఇంట్లోకి వచ్చిన టాపిక్ గురించి మాట్లాడింది.కౌశల్ కూతురు పుట్టినరోజు నాడు ఆమెని ఇంట్లోకి పంపాలని కౌశల్ గతవారంలో నానిని రిక్వెస్ట్ చేశాడు. కుతురు వస్తే కౌశల్‌కు బూస్ట్ వస్తుందని దాని మీద చర్చ నడించింది.ఆ చర్చ కాస్తా వాగ్వాదంగా మారింది.
చిన్న గొడవ కాస్త పెద్ద వివాదానికి దారి తీసింది. కౌశల్‌ను ఒక్కడినే చేసి ఇంటి సభ్యులందరు అతనిపై గొడవకు దిగడంతో సహనం కోల్పోయిన కౌశల్ నేను మాట్లాడుతుంటే అందరూ కుక్కల్లా మీద పడిపోతారు అంటూ నోరుజారారు. అంతే సామ్రాట్,తనీష్,రోల్ రైడాలు కౌశల్‌తో గొడవకు దిగారు.ఏం మాట్లాడుతున్నావ్ అంటూ రెచ్చిపోయారు.రోల్ తన యాక్టింగ్‌తో ఎపిసోడ్‌ని మరింత రక్తి కట్టించాడు.తనీష్ ఓ అడుగు ముందుకేసి ఇక్కడి కాబట్టి బ్రతికిపోయావ్ కౌశల్..అదే బయట అయితే నేను ఏంటో చూపించేవాడిని అంటు కౌశల్‌కు వార్నింగ్ ఇచ్చాడు తనీష్.