యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతున్న ఎన్టీఆర్‌కు ఫ్యామిలీ గురించి ఓ ప్రశ్న ఎదురైంది.తన సోదరుడు కల్యాణ్ రామ్ తల్లితో మీరు ఎలా ఉంటారు అని ఓ యాంకర్ ఎన్టీఆర్‌ని ప్రశ్నించింది.యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తు ….కళ్యాణ్ రామ్ తల్లిని పెద్దమ్మ అని సంభోదించాడు ఎన్టీఆర్.తండ్రి మరణంతో తాను, కళ్యాణ్ రామ్ ఎంతో బాధ పడుతున్నామని, ఆ సంఘటన నుండి బయటకి రాలేకపోతున్నామని.. తమ కంటే తమ తల్లుల బాధ ఇంకా పెద్దదని అన్నాడు.
తన తల్లితో పాటు పెద్దమ్మ తీవ్ర మనోవేదనకి గురవుతున్నట్లు చెప్పుకొచ్చారు. తండ్రిలానే తాను కూడా సంపూర్ణంగా జీవించాలని భావిస్తున్నట్లు, తన పిల్లలకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లు తారక్ ఎమోషనల్ గా చెప్పాడు. మా పెద్దమ్మాని కూడా నా తల్లిలాగే భావిస్తానని ,మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు ఇద్దరు భార్యలు అన్న సంగతి తెలిసిందే.మొదటి భార్య కొడుకు కల్యాణ్ రామ్ కాగా,రెండో భార్య కొడుకు ఎన్టీఆర్.మొదట్లో వీరిద్దరి మధ్య మాటలు ఉండేవి కాదు. కానీ మెల్లగా ఇద్దరూ ఒకటయ్యారు.