వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో నేతలకు బిగ్‌షాక్ ఇస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎంత పెద్దనాయకులకైనా టికెట్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా గట్టి షాక్ ఇస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉన్నవారికే టికెట్లని ఇప్పటికే సంకేతాలు పంపిన జగన్… తాజాగా ఆయన సన్విహితుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ విషయంలో మొండి చేయి చూపారు.
మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణకు జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆర్కేకి సీటు ఇవ్వకుండా దూరం పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆర్కే స్థానంలో ఎవరికి టికెట్ కేటాయించాలనే దానిపై జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ నేతలందరిలో మంచి పేరున్న వ్యక్తి ఆళ్ల రామకృష్ణ కి కూడా ఇదే పరిస్థితి ఎదురౌతోంది. పార్టీకి, జగన్‌కు ఆర్కే తొలి నుంచి వీరవిధేయుడుగా వ్యవహరిస్తూ వచ్చారు. టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కేసులతో చినబాబు, పెదబాబుకు నిద్రలేకుండా చేస్తున్నారు .
రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఉండటంతో ఒక రకంగా తెలుగుదేశంకు, సీఎం చంద్రబాబుకు తరచూ కంట్లో నలుసుగా మారి కోర్టు కేసుల ఆర్కేగా పేరుగడించారు. అయితే మొదట్లో తానే ఈ సారి పోటీ చేయలేనని, కొంత ఆర్థిక ఇబ్బందులు మూలంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని జగన్‌కు చెప్పగా ఆయన మౌనం వహించడమే తప్ప తిరిగి పోటీ చేయాలని ఒత్తిడి చేయలేదని తెలిసింది.
అయితే ఆర్థిక వనరులు సమకూర్చుకున్న ఆర్కే ఒద్దిరోజుల క్రికతం జగన్‌ను కలసి పోటీకి సిద్ధమని చెప్పినా వైసీపీ జగన్ మాత్రం హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. నియోజక వర్గంలో అసమ్మతి ఉందని, వారందరినీ కలుపుకొని వస్తేనే టిక్కెట్ ఇస్తానంటూ పరోక్షంగా టిక్కెట్ లేదని చెప్పేసినట్లు తెలిసింది. ఆర్కేకే ఇలాంటి పరిస్థితి వచ్చిందటే మిగితా నేతల పరిస్థితి ఉంటే మా పరిస్థితి ఏంటని నాయకులు ఆందోనలో ఉన్నారు.
