అదేంటీ కౌశల్ కోమాలోకి వెళ్లడం ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేందడీ ….తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్‌గా కౌశల్ నిలిచిన సంగతి తెలిసిందే.ఏకాంగా 40 కోట్ల ఓట్లు సాధించి మరి బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచాడు కౌశల్.మరి అలాంటీ వ్యక్తి కోమాలో ఉండటం ఏంటీ అనే కదా మీ డౌట్.బిగ్‌బాస్‌కి రాకముందు కౌశల్ కొన్ని సీరియల్స్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.కౌశల్ బిగ్‌బాస్‌కు వెళ్లడంతో ఆ సీరియల్స్‌లో కౌశల్ పాత్రలను మధ్యలోనే ఆపేశారు.కౌశల్ తిరిగి సీరియల్స్‌లో నటిస్తుండటంతో మళ్లీ ఆ పాత్రలను తెర మీదకు తీసుకువస్తున్నారు.
జీ తెలుగులో ప్రసారమయ్యే సూర్యవంశం సీరియల్లో కౌశల్ విలన్‌గా నటిస్తున్నాడు.బిగ్‌బాస్‌లో అవకాశం రావడంతో సూర్యవంశం సీరియల్ యాజమాన్యంతో మాట్లుకుని ఈ షోకి వచ్చాడు కౌశల్.అయితే ఈ సీరియల్లో కౌశల్‌ది కీలక పాత్ర కావడంతో,కౌశల్‌ను తప్పించలేక ఆ పాత్రను కోమాలోకి వెళ్లినట్లు చూపించారు సూర్యవంశం టీం.ఇప్పుడు కౌశల్ బయటికి రావడం,తిరిగి సీరియల్స్‌ను చేస్తుండటంతో సూర్యవంశంలో కోమాలోకి వెళ్లిన పాత్రను బయటికి తీసుకువస్తున్నారు.దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.దీనిని బట్టి కోమాలోకి వెళ్లి కౌశల్ ఇన్నాళ్లుకు బయటకి వస్తున్నాడు.