జనసేన అధ్యుక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఎవరికీ అర్థం కాదు. పబ్లిక్ మీటింగ్‌లో ఊగిపోవడం, ఆవేశంగా ప్రజలకు అర్థంగాని ప్రసంగాలు చేయడం మామూలే. ఒక సారి నన్ను సీఎంను చేయండంటాడు..మరో సారి నాకు అనుభవం లేదంటారు. అంతటితో ఊరుకుంటాడా….. తండ్రి సీఎం అయితే కొడుకు సీఎం కావాలాని రూల్ ఉందా అని జగన్‌ను విమర్శించడం తెలిసిందే. జగన్‌తో పాటు లోకేష్‌ను విమర్శించిన దాఖలాలు అనేకం.
రాజకీయాల్లో ఓపిక, సహనం, అచితూచి మాట్లాడటం , ప్రజల మనసులను ఆకట్టుకొనే విధంగా ప్రసంగాలు ఉండాలి గాని గాలికి కొట్టుకొని పోయే విధంగా పవన్ ప్రసంగాలుంటాయి. ప్రతీ సారి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే పవన్ సినిమా వారసత్వ రాజకీయాల గురించి కూడా మాట్లాడడు…ఎందుకంటే పవన్‌కూడా సినిమాల్లోకి వారసత్వం నుండే కదా వచ్చింది.
చిరంజీవి పేరు చెప్పుకొని మెగా కుటుంబంనుంచి ఎంత మంది హీరోలు పరిశ్రమలోకి రాలేదు. అసలు పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎలా వచ్చారు? మీ కుటుంబంలో అంతమంది హీరోలు అయింది వారసత్వంతో కాదా? చిరంజీవి లేకుంటూ వీరంతా ఎక్కడుండే వారో. సినిమాల్లో వారసత్వ రాజకీయాలు ఉండొచ్చు రాజకీయాల్లో ఉండకూడదా..? భవిష్యత్తులోనైనా పవన్ వారసత్వ రాజకీయీల గురించి మాట్లాడకుండా… సినిమా వారసత్వం గురించి మాట్లాడితే బాగుటుంది.
