విజయనగరం జిల్లాలో కీలకమైన రాజ వంశాలల్లో బొబ్బిలి ఒకటి. ఆ పేరు చెబితే చాలు పౌరుషానికి మారు పేరుగా భావిస్తారు. బొబ్బిలి గడ్డ పోరాటాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విజయ నగరం జిల్లాలో కొనసాగుతోంది. జిల్లా ప్రజలు జగన్‌ను జేజేలు కొడుతున్నారు. అయితే బొబ్బిలి లో జగన్ ఎలా గర్జిస్తాడన్నది ఇపుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.
బొబ్బిలి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సుజయ క్రిష్ణ రంగారావుకు జగన్ సవాల్ చేయనున్నారా..? అన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు వైసీపీలో ఉండి మంత్రి పదవి కోసం పార్టీని ఫిరాయించిన రాజు గారికి అదే కోట వద్ద జవాబు చెప్పనున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా బొబ్బిలి వైసీపీదేనని గట్టిగా చెబుతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. ఇక్కడ జనం మొదటి నుంచి కాంగ్రెస్ ని ఆదరిస్తూ వస్తున్నారు. అలాగే వైసీపీకి కూడా పెద్ద పీట వేశారు. అనేక ఎన్నికల్లో సైకిల్ పార్టీ ఇక్కడ పరాజయం పాలైంది. సుజయ కృష్ణరంగా రావు పార్టీ ఫిరాయించడంతో ఆయనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు.
బొబ్బిలి రాజులంటే పౌరాషానికి ప్రతీకలని, మాట ఇస్తే వెనక్కు తగ్గరని పేరు. అటువంటిది ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో మారడాన్ని ఇక్కడ జనం తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో సరైన అభ్యర్ధిని వైసీపీ పెడితే మాత్రం సుజయకు పరాభవం తప్పదని కూడా అంటున్నారు.
ఇక వైఎస్ జగన్ బొబ్బిలి గడ్డపై ఏం చెబుతారో అన్న ఉత్కంఠ అంతటా ఉంది. జగన్ ఇంతవరకు బొబ్బిలి రాజులపై డైరెక్ట్ అటాక్ చేయలేదు. ఈసారి పాదయాత్రలో మాత్రం మాటల తూటాలు పేలుతాయని, బొబ్బిలి రాజులపై సెటైర్లు కూడా ఉంటాయని అంటున్నారు. అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో జగన్ గర్జనకు బొబ్బిలి కోటలు బీటలు వారడం కాయం అంటున్నారు అక్కడి ప్రజలు.
