తమిళ స్టార్ హీరో విజయ్,స్టార్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం సర్కార్.గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన తుపాకి,కత్తి సినిమాలు సూపర్ హిట్లగా నిలవడంతో ,ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.హీరోయిన్గా కీర్తి సురేష్,ప్రధాన పాత్రలో వరలక్షీ నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈ రోజే విడుద అయింది.ఇక సినిమా ప్రీమియర్ షోలు తమిళనాట అలాగే పలు రాష్ట్రాల్లో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు ఆ టాక్ ఎలా ఉందొ చూద్దాం..
కథ:
విజయ్ తన ఓటు వేయడానికి భారతదేశానికి వస్తాడు, కానీ తన తరఫున ఓటు ఎవరో వేసినట్లు తెలుసుకున్న తర్వాత అతను ఊహించని దారిలో వెళతాడు. తమిళ రాజకీయలకు దగ్గరగా ఉండేట్లు చాలా సన్నివేశాలను డిజైన్ చేశారు. ఎన్నికలు వాయిదా పడటం విజయ్ విలన్స్ ని ఎదుర్కోవడం మాత్రం కొంచెం రొటీన్ గా అనిపిస్తాయి. ఇక కోపంతో ఉన్న వ్యక్తి ఇప్పుడు అపరాధులను ఎలా దారిలోకి తెచ్చి బహిర్గతం చేశాడు అనేది తదుపరి స్క్రీన్ పై చూడాలి.
విశ్లేషణ:
స్ట్రాంగ్ మెస్సేజ్ తో దర్శకుడు సినిమాను తెరకెక్కించడాని చెప్పవచ్చు. ప్రజాస్వామ్య వేడుకలో పాల్గొనే ప్రాముఖ్యతను సర్కార్ సినిమా నొక్కి చెబుతుంది.ప్రతి సీన్ ను దర్శకుడు విజయ్ క్రేజ్ కి తగ్గట్టు క్రియేట్ చేసుకున్నాడు. ఫాన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ సినిమాలో చాలా ఉంటాయని చెప్పవచ్చు. ఇక కీర్తి సురేష్ మొదటి సారి సరికొత్త లుక్స్ తో అందరిని ఆకర్షించింది. యాక్షన్ సీన్స్ ఆదిరిపోయాయి. దానికి తోడు ఏఆర్.రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమా స్థాయిని పెంచుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ రొటీన్ గానే అనిపిస్తాయి. పాత కథలను కూడా గుర్తు చేస్తాయి కానీ మురగదాస్ తనదైన శైలిలో చాలా స్టైలిష్ గా సినిమాను ప్రజెంట్ చేశాడు. ఈ దీపావళికి విజయ్ ఫ్యాన్స్ కి సినిమా ఫుల్ కిక్ ఇస్తుందని చెప్పవచ్చు.
బోటమ్ లైన్:
విజయ్‌కు మళ్లీ హిట్ ఇచ్చిన మురుగదాస్
