Friday, May 17, 2024
- Advertisement -

కిడారి శ్రావ‌న్‌, ఫ‌రూక్‌కు బాబు కేటాయించిన మంత్రి ప‌దువులు

- Advertisement -

ఏపీ కేబినెట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు విస్తరించనున్నారు. ఈ క్రమంలో శాసనమండలి ఛైర్మన్ ఫరూక్ తో పాటు మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్ లకు ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎన్.డీ ఫరూక్ కు వైద్యఆరోగ్యశాఖ, కిడారి శ్రవణ్ కు గిరిజన సంక్షేమ శాఖలను కేటాయించింది.

అమరావతిలో వీరితో సమావేశమైన చంద్రబాబు..మంత్రివర్గంలో అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. కిడారి శ్రావణ్‌కు గిరిజన సంక్షేమశాఖ, ఫరూఖ్‌కు వైద్య, ఆరోగ్యశాఖను అప్పగించారు. సహచర మంత్రులతో పాటు జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఇద్దరు నేతలకు చంద్రబాబు సూచించారు.

ముస్లిం మైనార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు.. వారికి మంత్రి, మండలి ఛైర్మెన్, ప్రభుత్వ విప్ పదవులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలి ఛైర్మెన్‌గా ఉన్న ఫరూఖ్‌కు మంత్రి పదవి ఇచ్చారు. శాసన మండలి ఛైర్మెన్‌గా షరీఫ్‌ను నియమించారు. అటు చాంద్ భాషా‌కు ప్రభుత్వ విప్‌గా నియమించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -