తమిళ స్టార్ హీరో విజయ్ ,ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సర్కార్.ఓటు విలువ తెలిపేలా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదల అయింది.సినిమాపై మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి కలెక్షన్లు మాత్రం కుమ్మేస్తున్నాయి.తాజాగా ఈ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరినట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.దీనికి సంబంధించి ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. తెలుగు .. తమిళనాడు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ లోను ఈ సినిమాను భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది.
6 రోజుల్లో ఈ సినిమా యూఎస్ ఏలో 6.62 కోట్లు .. యూకేలో 3.63 కోట్లు .. ఆస్ట్రేలియాలో 2.21కోట్లు .. న్యూజిలాండ్ 20.05 లక్షలు .. యూఏఈ/జిసీసీలో కలుపుకుని 5 రోజుల్లో ఈ సినిమా 15.66 కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయి సంచలనాన్ని సృష్టించింది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహామాన్ సంగీతం అందించారు.