- Advertisement -
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేదానికి రెండు, మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తానన్న పవన్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. నిర్ధిష్టటైంలో ఎన్నికలు జరిగితే పోటీ చేయాలని నర్ణయించుకున్నామని కానీ ముందుగా ఎన్నికలు రావడంతో … నూతనంగా ఏర్పడిన తమ పార్టీకి అభ్యర్థులను ఎంపిక చేయడం కష్టమని పవన్ పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు పోటీ చేయంలేదన్నారు.
తెలంగాణ ప్రజల పక్షాన నిలవడమే జనసేన లక్ష్యం. తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగింది. శాసనసభ ఎన్నికలకు కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగనున్న రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించిందని పవన్ తెలిపారు.

