ఒక నాయకుడిమీద అభిమానం పెంచుకుంటే ఎంత వరకైనా వెల్తారు అభిమానులు. తన అభిమాన నాయకులకోసం ప్రాణాలను సైతం లెక్క చేయరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక వందల సంఖ్యలో ఆయన అభిమానులు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. అంతలా అభిమానాన్ని సంపాదించుకున్నారు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.
అభిమానం అనేది దేశాలు దాటినా అ అభిమానం మన గుండెలనుంచి పోదు. తాజాగా జగన్ విషయంలో కూడా అదే జరిగింది.ఆస్ట్రేలియాలో ఉంటోన్న కొంత మంది ఎన్ఆర్ఐలు జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మెల్‌బోర్న్‌లో శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఎవరూ ఊహించని దృశ్యం ఒకటి కనిపించింది.
మెల్‌బోర్న్‌లో ఉంటోన్న కొంతమంది జగన్ అభిమానులు మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు పట్టుకుని గ్యాలరీలో సందడి చేశారు. ‘జగన్ వెంట మేమున్నాం’ అంటూ ఫ్లెక్సీని ప్రదర్శించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు యార్లగడ్డ రమ్య, రాజేష్ శాకమూరి తదితరులు ఇలా పార్టీ బ్యానర్లు, జెండాలతో స్టేడియంలో సందడి చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటూ వారు జగన్ ఫ్లెక్సీలను స్టేడియంలో ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.