- Advertisement -

‘మీటూ’లో త‌న పేరు రాలేద‌ని బాధ‌ప‌డుతున్న రామ్ గోపాల్ వ‌ర్మ‌

- Advertisement -

ఆ మ‌ధ్య కాలంలో #మీటూ ఉద్య‌మం ఓ ఊపు ఊపిన సంగ‌తి తెలిసిందే.బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కు మ‌హిళ‌లు త‌మకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. ఈ వేధింపులలో చాలామంది సెల‌బ్రిటీల పేర్లు బ‌య‌టికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.ఈ లిస్ట్‌లో వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ పేరు రాక‌పోవ‌డంపై చాలామంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.తాజాగా దీనిపై స్పందించారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ”మీటూలో అంతా నా పేరు ఉంటుందని అనుకున్నారు. నా గురించి ఒక్క హీరోయిన్ కూడా మాట్లాడకపోవడం బాలీవుడ్ వాళ్లని ఆశ్చర్యపరుస్తోంది.

నిజానికి నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. పొద్దున్న లేస్తే తొడల గురించి, అమ్మాయిల గురించి మాట్లాడుతుంటా.. అందుకే వాళ్లెవరూ నా పేరు బయటకి తీసుకురాలేదేమో.. ఇక మీటూ ఉద్యమం ద్వారా ఏం సాదిస్తున్నారనేది పక్కన పెడితే, చిత్రసీమలో ఇలాంటి సమస్య ఉందనే విషయం ప్రజలకు అర్ధమవుతుంది. తాము ఎదుర్కొంటున్న సమస్యపై మాట్లాడడానికి ఓ వేదిక దొరికినట్లు అవుతుంది. అయితే ఇలాంటి ఉద్యమాల వల ఇలాంటి సమస్యలు ఆగుతాయని నాకు అనిపించడం లేదని” వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -