ఎన్టీఆర్ ఈ సారి మరో హిట్‌తో హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. టెంపర్ , నాన్నకు ప్రేమతో అంటూ వరుసగా రెండు భారీ హిట్స్ తర్వాత వస్తున్న జనత గ్యారేజ్ తో మరో భారీ హిట్ కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకోవాలి అని ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ మూడో సినిమా కూడా హిట్ ఖాయం అంటున్నారు.
కొరటాల శివ డైరెక్షన్ లో మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12 న విడుదల తేదీ ఇప్పటికే ప్రకటించేశారు. కొరటాల శివ – ఎన్టీఆర్ ల కాంబినేషన్ ఇప్పుడు సంచలనం గా మారింది. ఈ సినిమా బంపర్ హిట్ అవుతుంది అని ఒక కొత్త సెంటిమెంట్ ని చెబుతున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. అదేంటంటే..
ఎన్టీఆర్ సింహాద్రి అనే బ్లాక్ బస్టర్ గుర్తుంది కదా.. ఆ సినిమా కి సంబంధించిన కీలక సన్నివేశాలు అన్నీ కేరళ లో చిత్రీకరణ జరిపారు. ఆ తరవాత ఎన్టీఆర్ ఏ సినిమా కీ కేరళ వెళ్ళలేదు. సో జనతా గ్యారేజ్ కోసం ఇప్పుడు ఇన్నాళ్ళ తరవాత కేరళ వెళుతున్నాడు. ఈ సినిమా కూడా కేరళ లో షూటింగ్ జరపడం తో ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుంది అనే సెంటిమెంట్ ని ఫిక్స్ అయ్యారట ఎన్టీఆర్ ఫాన్స్. ఆ సినిమా సెంటిమెంట్ ని జనతా గ్యారేజ్ కి ఆపాదించి సూపర్ హిట్ అయ్యి తీరుతుంది అంటున్నారు. అసలే మంచి అంచనాలతో ఉన్న జనతా గ్యారేజ్ కి ఈ సెంటిమెంట్ టాక్ కూడా తోడైతే తారక్ ఖాతాలో హ్యాట్రిక్ పడ్డట్టే…