ఫసక్ ఈ పదం ఎంత పాపులరిటీ అయిందో అందరికి తెలిసిందే.మంచు మోహన్ బాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు ఫైట్స్ సీన్స్ గురించి వివరిస్తు ఫసక్ ,ఫసక్ అన్నారు.ఫసక్ అనే పదం అనూహ్యమైన స్థాయిలో పాప్యులర్ అయిపోయింది.చాలామంది ఈ ఫసక్ అంటే ఏమిటో అని తెలుసుకునే ప్రయత్నాలు చేశారు.ఇక ఈ పదం గురించి సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఇంత పాపులర్ అయిన ఈ పదంతో ఓ సినిమాను రూపొందించున్నారు.మంచు విష్ణు తన సొంత బ్యానర్ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై ఒక సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ‘ఫసక్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తోంది. అయితే హీరోగా మంచు విష్ణు నటిస్తాడా లేక మరో హీరోని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
- తమిళనాడు రాజకీయాల్లో సంచలనం!
- మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు: జగన్
- నిర్మాతగా మారిన యాంకర్ ఉదయభాను!
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
