యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పడి పడి లేచె మనసు.హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తుంది.రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది ఈ సినిమా.ఇప్పటికే విడుదల అయిన టీజర్ ,సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది.తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. కోల్‌కత బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకథతో ఈ సినిమాను తెరకెక్కించారు.
సూర్య అనే కుర్రాడు, డాక్టర్ చదువుతోన్న వైశాలి అనే ఇద్దరి మధ్య జరిగే ఎమోషనల్ డ్రామానే ఈ సినిమా. సూర్య పాత్రలో శర్వానంద్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సాయి పల్లవి మరోసారి తన నటనతో యూత్ ని ఫిదా చేయడానికి రెడీ అవుతుందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.కథలో దమ్ము ఉంటేనే సినిమాలు చేసే శర్వానంద్ సాయిపల్లవిలు ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక సినిమాను సంక్రాంతి బరిలో నిలపడానికి ప్రయత్నలు చేస్తున్నారు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!