Friday, May 3, 2024
- Advertisement -

అంత‌హ‌: క‌ర‌ణ శుద్ధితో ….కేసీఆర్ ప్ర‌మాణ‌స్వీకారం

- Advertisement -

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా అనుకున్న ముహూర్తం మధ్యాహ్నం 1.25 గంటలకు కేసీఆర్ సీఎంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. కేసీఆర్ చేత ప్రమాణం చేయించారు. కేసీఆర్ దైవ సాక్షిగా ప్రమాణం చేయగానే సభా ప్రాంగణమంతా జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది.

ఆయనతో పాటు మహమూద్ అలీ కూడా ప్రమాణం చేశారు. ఈయనకు మరోసారి డిప్యూటీ సీఎం ఛాన్స్ దక్కనుందని తెలుస్తోంది. కేసీఆర్ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఆయన కుటుంబసభ్యులతో పాటు టీఆర్ఎస్ తరపున కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు.

కేసీఆర్ తర్వాత మొహమూద్ అలీ ప్రమాణం స్వీకారం చేశారు. కేసీఆర్ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేయగా, మొహమూద్ అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు. అనంతరం వీరిద్దరికి గవర్నర్ నరసింహాన్ శుభాకాంక్షలు తెలియజేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -