ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాద్య దైవం నందమూరి తారక రామారావు జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆయన తనయుడు హీరో బాలకృష్ణ స్వయంగా నటిస్తు, నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. దీంతో సినిమా ఆడియో ఫంక్షన్‌ను గ్రాండ్‌గా చేయలని భావిస్తున్నాడు బాలకృష్ణ.దీనిలో భాగంగానే ఎన్టీఆర్ సొంత ఊరైనా నిమ్మకురులో ఆడియో ఫంక్షన్ చేస్తున్నారు.
ఈ ఫంక్షన్‌కు టాలీవుడ్ పెద్దలతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులను పిలవాలని భావిస్తున్నాడట బాలయ్య.ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కూడా ఆడియో వేడుకకు పిలవాలనుకున్నారు. మొదట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఈ సినిమాకు పిలవాలని భావించిన బాలయ్య, ఇప్పుడు తన మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తుంది.ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు.పైగా ఈ ఎన్నికలలో టీడీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది.నందమూరి సుహాసినిని కూడా గెలిపించుకోలేకపోయిరు బాలకృష్ణ.ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్‌ను పిలిస్తే బాగుండదని ఆలోచిస్తున్నారు.
పైగా కేసీఆర్ చంద్రబాబు అంటే చాలు మండిపడుతున్నారు.ఇటువంటి పరిస్థితులలో వీరిద్దరు ఒకే వేదికను ఎలా పంచుకుంటారో అనే అనుమానం కూడా అందరిలోను ఉంది.ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఉన్నారు బాలకృష్ణ.అయితే ఆడియో వేడుకను కొన్ని రోజులు వాయిదా వేస్తే ఈ ఎన్నికల వేడి కాస్తా తగ్గుందని పెద్దలు చెప్పడంతో ఆడియో వేడుకను 21వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. అప్పుడు ఈ ఫంక్షన్‌కు కేసీఆర్ పిలిచిన పెద్ద నష్టం ఏం ఉండదని ఎన్టీఆర్ టీం భావిస్తుంది.మరి బాలకృష్ణ పిలిచినప్పటికి కేసీఆర్ ఆంధ్రకు వెళ్తారా ? అనేది అనుమానమే.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!