‘మాస్క్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ పూజా హెగ్డె.తెలుగులో మాత్రం వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుందాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత ఒక లైలా కోసం సినిమా చేసింది పూజా.బాలీవుడ్లో ఆఫర్ రావడంతో తెలుగు ,తమిళ సినిమాలకు బై చెప్పి అక్కడో సినిమా చేసింది.బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పక్కన మొహంజదారో సినిమా చేసింది.ఈ సినిమా పూర్తి అవ్వడానికి రెండు ఏళ్లు పట్టింది. ఈ రెండు సంవత్సరాలలో మరో సినిమా అంగీకరించలేదు.
అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు ..నేను సినిమా హిట్ ,ప్లాప్లను ,చూడను కథ నచ్చితే ఎవరితో అయిన చేస్తా.కథ నచ్చకపోవడంతో ఓ స్టార్ హీరో సినిమా కూడా రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది. ఓ సినిమా ఒప్పుకునే ముందు కథతో పాటు హీరో, నిర్మాణ సంస్థ గురించి కూడా ఆలోచిస్తానంటుంది పూజా హెగ్డె.మరి ఇంతకి ఆమె రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలియాల్సి ఉంది.పూజా హెగ్డె ప్రస్తుతం మహేశ్,ప్రభాస్ సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది.
- Advertisement -
తెలుగు టాప్ హీరోని రిజెక్ట్ చేసిన పూజా హెగ్డె
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -