ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన నోటికి పని చెప్పాడు.పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రసతవత్తరంగా మారింది.విజయం కోసం రెండు జట్లు నువ్వా, నేనా అన్నట్లు పోరాటం చేస్తున్నాయి.132/4 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ నిలకడగా ఆడే యత్నం చేసింది. ఓవర్‌నైట్ ఆటగాళ్లు ఉస్మాన్ ఖాజా, కెప్టెన్ టిమ్ పైన్‌లు అత్యంత జాగ్రత్తగా ఆడుతూ వికెట్‌ను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. మహ్మద్ షమీ రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో ఆసీస్ వరుసగా వికెట్లను చేజార్చుకుంది.
టిమ్ పైన్(37), అరోన్ ఫించ్(25), ఉస్మాన్ ఖవాజా(72)లను కొద్ది పాటి వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఓవరాల్‌గా భారత్ ముందు ఆసీస్ 287 లక్ష్యాన్ని ఉంచింది.287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిర టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్ నాల్గో బంతికి రాహుల్ డకౌట్‌గా పెవిలియన్ చేరగా, హజల్‌వుడ్ బౌలింగ్‌లో పుజారా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్‌తో పాటు కెప్టెన్ కోహ్లి క్రీజులో ఉన్నారు.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!