తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ఉన్న సెలబ్రిటీ రిసార్ట్ లో రేవ్ పార్టీని ఈరోజు తెలంగాణ ఎస్ వోటీ పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 11 మంది డాక్టర్లతో పాటు నలుగురు యువతులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ చేసే కొద్దీ రేవ్ పార్టీ వెనుక విస్తుపోయో నిజాలు బయటకు వస్తున్నాయి.
ఈ రేవ్ పార్టీ వెనుక ఓ బడా పార్మా కంపనీ హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫార్మా కంపనీలు తయారు చేసే ఔషదాలను విక్రయించాలంటే హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, డాక్టర్లపై ఆదారపడాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలతో భాదపడే వారు డాక్టర్లు సూచించే మందులను వాడుతుంటారు. దీంతో తమ ఔషదాల అమ్మకాలకు సహకరించే డాక్టర్లకు కొన్ని కంపనీలు బహుమతులు ఇస్తుంటాయి.
ఈ వ్యవహారం వెనుక ఉన్న కంపెనీ పేరును మాత్రం పోలీస్ అధికారులు బయటపెట్టలేదు. అయితే అరెస్టయిన 11 మంది వైద్యులు గజ్వేల్ కు చెందినవారే. సదరు ఫార్మా కంపెనీ వ్యాపారాన్ని పెంచుకోడానికి ఇలా పార్టీ పేరుతో డాక్టర్లకు అమ్మాయిలను ఎర వేసింది. గజ్వేల్ ప్రాంతానికి చెందిన కొందరు డాక్టర్లకు రిసార్టుకు తీసుకువచ్చిన సదరు కంపనీ ప్రతినిధులే అమ్మాయిలను కూడా సప్లై చేసినట్లు పోలీసులు తెలిపారు. సదరు పార్మా కంపనీపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు పోలీసలు సిద్దమవుతున్నారు.