దేశంలో ఫెడరల్ ఫ్రెట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కేసీఆర్ భాజాపా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో మరింత దూకుడు పెంచారు. దీనిలో భాగంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు.
ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అనంతరం కోల్‌కతా చేరుకున్నారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చించేందుకు గాను కేసీఆర్ రెండో సారి మమత బెనర్జీతో సమావేశమయ్యారు. ఫ్రంట్‌కు మద్దతు కోరడంతో పాటు విపక్షాలను ఏకం చేసే ప్రణాళికపై ఆమెతో చర్చించనున్నారు.మమతా బెనర్జీతో భేటీ అనంతరం కోల్‌కతాలోని కాళిమాత ఆలయాన్ని కేసీఆర్ సందర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.
మమతాబెనర్జీతో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు కేసీఆర్ చెప్పారు. గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళికతో మీ ముందుకొస్తామని సీఎం వెల్లడించారు.