Tuesday, April 30, 2024
- Advertisement -

ఆ హీరో కోసం అనుష్క మరోసారి అలా చేస్తోంది..!

- Advertisement -

ఇది కొత్త కాదు.. ఇప్పటికే హీరోయిన్ అనుష్క ఆ హీరో కోసం చాలా సార్లు ఇలా చేసింది. ఇప్పుడు మరోసారి ఆయన కోసం.. ఆయన అడిగారని అదే పనికే పూనుకొంది. నిత్యం సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తీరిక చేసుకొని ఆయన కోసం ఇలా చేస్తోంది.

దీనికంతటికీ కారణం అనుష్కకు ఆ హీరోతో ఉన్న అనుబంధమే!

ఇంతకీ కథేంంటే.. నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమాలో అనుష్క ఒక అతిధి పాత్ర చేయబోతోంది. ఆ సినిమాలో అలా కనిపించి మెరవబోతోంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు కార్తీ కూడా హీరోగా నటిస్తున్న విషయం విదితమే. వంశీ పైడిపల్లి దర్శకత్వంతో  రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్నారు.

ఈ సినిమాలో అనుష్క గెస్టప్పీరియన్స్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంతకు ముందు కూడా నాగార్జున నటిస్తున్న సినిమాల్లో అనుష్క ఇలా మెరిసింది. నాగార్జున ప్రొడక్షన్ లో వచ్చిన ఒక సీరియల్ లో కూడా అనుష్క ఇలా మెరిసింది. మరి ఆమెను తెరకు పరిచయం చేసింది నాగార్జునే కాబట్టి.. వారి మధ్య ఇలాంటి అనుబంధం ఉండవచ్చు. ఇలా గెస్టప్పీరియన్స్ లకు కారణం అవుతుండవచ్చు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -