Wednesday, May 15, 2024
- Advertisement -

సంచలనం: ఏడు మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ దారిలో..?!

- Advertisement -

శాసన సభ కోటాలో శాసనమండలి సభ్యుల నామినేషన్లకు సంబంధించి జరుగుతున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో శాసనమండలిలోని ఆరు సీట్ల కోసం జరుగుతున్న ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవహరిస్తున్న తీరు రాజకీయాలను వేడెక్కిస్తోంది. తమకు సొంతంగా బలం లేకపోయినా..

ఐదో అభ్యర్థిని నిలెబెట్టిన టీఆర్ఎస్ ఇలా తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బతీయాలని భావిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఏకంగా ఏడు మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు వల వేస్తోందట తెలంగాణ రాష్ట్ర సమితి.

బలా బలాలను బట్టి చూస్తే.. నాలుగు శాసనమండలి స్థానాలు తెలంగాణ రాష్ట్ర సమితికి దక్కుతాయి. ఒక స్థానం కాంగ్రెస్ కు, మరో స్థానం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల కూటమికి దక్కుతుంది. అయితే తమకు దక్కే వాటితో తెలంగాణ రాష్ట్ర సమితి సంతృప్తి పడటం లేదు. అందుకే ఐదో అభ్యర్థిని పోటీలో నిలిపింది. ఇప్పుడు ఈ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

నంబర్ గేమ్ ను బట్టి చూస్తే..  ఎంఐఎమ్ బలంతో కలుపుకొని  నాలుగు ఎమ్మెల్సీ సీట్లను సొంతం చేసుకొన్న తర్వాత కూడా తెరాస ఖాతాలో 11 మంది ఎమ్మెల్యేల బలం మిగిలి ఉంటుంది. అయితే ఐదో అభ్యర్థిని గెలిపించుకోవడానికి 18 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. అంటే ఏడుమమంది ఎమ్మెల్యేలను కలుపుకోవాల్సి ఉంటుంది. అందుకోసం  కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలపై కూడా తెరాస కొంత వరకూ ఆధారపడి ఉంది. అయితే రాయల్ గా ఈ సీటును సొంతం చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీని చీల్చడమే తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న మార్గం. ఆ విషయంలో ఆ పార్టీ ఏ మేరకు విజయవంతం అవుతుందనేదాన్ని బట్టే.. రాజకీయ మలుపులు ఆధారపడి ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -