బంగ్లాదేశ్‌లో జరిగని ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ భారీ మెజారిటీ సాధించింది. 299 స్థానాలకు పోలింగ్ జరగగా అధికార అవామీలీగ్ 288 స్థానాల్లో విజయఢంఖా మోగించింది. ఈ మేరకు బంగ్లా ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ ఉద్దీన్ ఆహ్మద్ ప్రకటించారు. దీంతో హసీనా రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో బంగ్లా దేశ చరిత్రలో ఓ ప్రధాని మూడోసారి ఎంపిక కావడం ఇదే మొదటిసారి.
ప్రతిపక్ష బంగ్లాదేశ్ నెషనలిస్ట్ పార్టీ ఏడు సీట్లలోనే గెలుపొందింది. ఇక అవామీ లీగ్ కూటమి పార్టీ అయిన జాతీయ పార్టీ 20చోట్ల గెలుపొందింది. గోపాల్ గంజ్ స్థానం నుంచి పోటీ చేసిన ప్రధాని షేక్ హసీనాకు 2,29,539 ఓట్లు వచ్చాయి. ఆమె ప్రత్యర్థి బీఎన్‌పీ అభ్యర్థికి కేవలం 123 సీట్లు మాత్రమే రావడం గమనార్హం.
దేశవ్యాప్తంగా అధికార, విపక్ష పార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 17 మంది చనిపోయారు.న్నికల ఫలితాలను ప్రతిపక్ష ఎన్‌యూఎఫ్ కూటమి తిరస్కరించింది. ‘ఈ ఫలితాలను మేం అంగీకరించట్లేదు. తటస్థమైన ఆపద్ధర్మ ప్రభుత్వం నేతృత్వంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’ అని ఎన్‌యూఎఫ్ కన్వీనర్ కమల్ హొస్సైన్ డిమాండ్ చేశారు.