స్మార్ట్ ఫోన్‌లు పేలిపోవడం సాదారణం అయ్యింది. లోకల్ అయినా, బ్రాండెడ్ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్‌లు అయినా పేలిస సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇక ఆపిల్ ఐఫోన్ అంటే స్టాండర్డ్‌కు పెట్టింపేరు. ఆపిల్ ఐఫోన్ అందరికీ స్టేటస్‌గా మారింది. అత్యున్నత ప్రమాణాలతో ఈ ఫోన్లు తయారవుతాయనే పేరుంది. చివరకు ఈ ఫోన్‌లు కూడా పేలుతున్నాయి.
ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ పేలింది . ఓ వ్యక్తి జేబులోనే ఐఫోన్ XS మ్యాక్స్ కాలిపోయిన ఘటన అమెరికాలోని ఒహైయోలో జరిగింది. దీంతో నష్టపరిహారం కోసం ఆ యువకుడు కోర్టుకు వెళ్లేదానికి సిద్దమయ్యారు. జె.హిల్లర్డ్ అనే వ్యక్తి లంచ్ చేస్తున్న సమయంలో అతడి ప్యాంట్ జేబులోని ఐఫోన్ నుంచి కాలిన వాసన వచ్చింది. అయితే కొద్ది సేపటికి ఫోన్ వేడెక్కి ప్యాంట్ కాలిపోయింది. దీంతో అతడు స్వల్పంగా గాయపడ్డాడు.
దాని బదులు షోరూమ్ వాళ్లు కొత్త ఫోన్ ఇస్తామన్నా అతను ఒప్పుకోవడంలేదు. జేబులో కాలిపోయినందుకు నష్టపరిహారం చెల్లించాలని యాపిల్ స్టోర్ నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ కాలిపోతున్న విజువల్స్ తన ఆఫీస్ సెక్యూరిటీ కెమెరాలో రికార్డయిందని చెప్పుకొచ్చాడు. దీనికి యాపిల్ స్టోర్ నిర్వాహకులు నిరాకరిండంతో కంపెనీపై చట్టపరంగా చర్యల కోసం హిల్లర్డ్ సిద్ధమవుతున్నాడు.
