Saturday, May 18, 2024
- Advertisement -

2018 అతి పెద్ద హిట్ సినిమా అదే..!

- Advertisement -

2018 సంవ‌త్స‌రం ఈరోజుతో ముగియ‌నుంది. రేప‌టి నుంచి కొత్త సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. ఎప్ప‌టిలాగే ఈ సంవ‌త్ప‌రం కూడా వంద‌ల సినిమాలు విడుద‌ల‌య్యాయి. కాని వాటిలో చాలా త‌క్కువ సినిమాలు విజ‌యం సాధించాయి. ఈ సంవ‌త్స‌రం దాదాపు 170 సినిమాలు విడుద‌లైతే ,వాటిలో విజ‌యం సాధించిన సినిమాలు 15 కూడా దాట‌లేదు.కాక‌పోతే స్టార్ హీరోల సినిమాలు ఎక్కువుగా విజ‌యాలు సాధించాయి. అలాగే కుర్ర హీరోలు కూడా త‌మ స‌త్తాను చాటారు.మ‌హేశ్ బాబు,ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు న‌టించిన సినిమాలు ఘ‌న విజ‌యాలు సాధించాయి. 2018లో విజ‌యం సాధించిన సినిమాల లిస్ట్ ఒక‌సారి చూద్దాం.

బాల‌కృష్ణ న‌టించిన ‘జై సింహా’, అనుష్క ‘భాగమతి’, నాగ‌శౌర్య ‘ఛలో’, విజ‌య్ దేవ‌ర‌కొండ ‘గీత గోవిందం’,రామ్ చ‌ర‌ణ్‌ ‘రంగస్థలం’ , మ‌హేశ్ ‘భరత్ అనే నేను’,కీర్తి సురేష్‌ ‘మహానటి’,వ‌రుణ్ తేజ్ ‘తొలిప్రేమ’,ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ ‘ఆర్ ఎక్స్ 100’, ‘గూఢ‌చారి’, ‘టాక్సీవాలా’ సినిమాలు నిర్మాత‌ల‌కు బాగా లాభాలు తెచ్చిపెట్టాయి. యావ‌రేజ్‌గా ఆడి నిర్మాత‌ల‌కు లాభాలు తెచ్చిపెట్ట‌కపోయిన న‌ష్టాల‌ను మాత్రం తీసుకురాని సినిమాలు కొన్ని ఉన్నాయి. ‘శైలజారెడ్డి అల్లుడు ‘సమ్మోహనం’, ‘నీది నాది ఒకే కథ’, ‘చిలసౌ’, ఈ నగరానికి ఏమైంది, హూషారు లాంటి సినిమాలకి ఓ రకమైన ప్రోత్సాహం లభించింది.

ఇక డ‌బ్బింగ్ సినిమాల విష‌యానికి వ‌స్తే వాటి ఫ‌లితాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. , ‘సర్కార్’, ‘పందెంకోడి2’, ‘విశ్వరూపం2’, ‘గ్యాంగ్’, ‘నవాబ్’, ‘2.0’, ‘చినబాబు’, ‘కెజిఎఫ్ వంటి చిత్రాలు ఉన్న‌ప్ప‌టికి వాటిలో 2.0 కేజీఎఫ్ సినిమాలు మాత్ర‌మే హిట్లుగా నిలిచాయి.’సర్కార్’, ‘పందెంకోడి2’, ‘చినబాబు సినిమాలు యావ‌రేజ్‌గా నిలిచాయి. ఏది ఏమైన‌ప్ప‌టికి ఈ సంవ‌త్స‌రం విడుద‌లైన తెలుగు సినిమాల‌లో అతి పెద్ద హిట్‌గా రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం సినిమా మొద‌టి స్థానంలో నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -