తమిళస్టార్ హీరో విజయ్‌కున్నా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అభిమానులు ముద్దుగా ఇళయదళపతి అని పిలుచుకుంటారు. ఇటీవల వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్నవిజయ్ ఫ్యాన్స్‌కు మరో పండుగ లాంటి ఒకటి బయటికి వచ్చింది. విజయ్ కొడుకు జెసన్ సంజయ్ నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. గతంలో విజయ్‌తో కలిసి కొన్ని సినిమాలలో బాలనటుడిగా చేసిన సంజయ్ ,ఇప్పుడు పూర్తి స్థాయి నటుడిగా మారాడు.
సంజయ్ నటించిన ఓ షార్ట్ ఫిలిం ఆనల్‌లైన్‌లో కావడంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.సంజయ్ ‘జంక్షన్’ అనే షార్ట్ ఫిల్మ్ లో లీడ్ రోల్‌లో నటించాడు.ఈ షార్ట్ ఫిల్మ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆరు నిమిషాల 51 సెకన్ల నిడివి గల ఈ లఘు చిత్రం థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కించారు.సంజయ్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి.
- వైసీపీ నేత హత్య కేసు..కోర్టు సంచలన తీర్పు
- లోకేష్‌కు జగన్ స్వీట్ వార్నింగ్!
- టీమిండియాలోకి ఎంట్రీపై భువి!
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- రిపేర్ అని ఆపాడు.. ప్రాణం తీశాడు!
