Thursday, April 25, 2024
- Advertisement -

పుజారా సెచ‌రీ..భారీ స్కోరు దిశ‌గా టీమిండియా…

- Advertisement -

అసిస్‌తో సిడ్నీలో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారీ స్కోరు దిశ‌గా టీమిండియా దూసుకెల్తోంది. నాలుగు వికెట్ల న‌ష్టానికి భార‌త్ 246/4 స్కోరుతో ఆడుతోంది. తొలిరోజున తన కెరీర్ లో218 బంతుల్లో 107 ప‌రుగులు సాధించి 18వ సెంచరీని న‌మోదు చేశాడు. ఈ సిరీస్ లో 3వ సెంచరీని నమోదు చేయడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది విహారి 9 (13) , 107 (218) స్కోరుతో క్రీజ్‌లో ఉన్నారు. రహానె (18) స్కోరు వ‌ద్ద స్టార్క్ బౌలింగ్‌లో కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంత‌రం పుజారా 199 బంతుల్లో సెంచీరీ సాధించాడు.

మూడో టెస్ట్‌లో టాస్ గెలిచి… బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 పరుగుల వద్ద తొలి వికెట్‌ నష్టపోయింది. ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (9) వైఫల్యాన్ని కొనసాగించాడు. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

మయాంక్‌ అగర్వాల్‌, చతేశ్వర్‌ పుజారా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును వంద పరుగులు దాటించారు. ఈ క్రమంలో మయాంక్‌ అర్ధసెంచరీ సాధించాడు.లయన్‌ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. చివరికి అతడి బౌలింగ్‌లోనే మయాంక్‌(77; 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అవుటయ్యాడు.

మయాంక్ ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ విరాట్ కొహ్లీతో కలిసి పుజారా మరో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. మూడో వికెట్‌కు కొహ్లీ-పుజారా 54 పరుగులు జోడించారు. 59 బంతుల్లో 23 పరుగులు చేసిన కొహ్లీ ..జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్ టిమ్ పెయిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత రహానేతో కలిసి మరో విలువైన భాగస్వామ్యం అందించారు. ప్రస్తుతం పుజారాకు తోడుగా హనుమ విహారి 8 పరుగులతో ఆడుతున్నాడు. భారత స్కోరు 4 వికెట్ల నష్టానికి 257 పరుగులతో టీమిండియా ఆట‌ను కొన‌సాగిస్తోంది. మ్యాచ్‌లో తొలి రోజే పుజారా చెలరేగాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని క్రీజ్‌లో పాతుకుపోయాడు. దీంతో భారీ స్కోరుపై క‌న్నేసింది టీమిండియా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -