Sunday, May 11, 2025
- Advertisement -

బన్నీని మెచ్చుకున్న ఎన్టీఆర్!

- Advertisement -

స్టార్ హీరోల ఫాన్స్ కలిసిమెలిసి ఉంటారో ఉండరో తెలియదు కాని స్టార్ హీరోలలో చాలామంది మాత్రం వీలు దొరికినప్పుడల్లా కలిసి బాగానే ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ లు కూడా ఉంటారు. ఒకరి సినిమాలకు ఒకరు ఫోన్ చేసుకుని రెగ్యులర్ విష్ చేసుకునే ఈ ఇద్దరు హీరోలు పలుమార్లు తమ స్నేహాన్ని పబ్లిక్ గానే ఒప్పుకున్నారు.

ఇక ఈ ఇయర్ నాన్నకుప్రేమతో సినిమా సమయంలో ఎన్టీఆర్ ని తెగ మెచ్చుకున్నాడు అల్లుఅర్జున్. తారక్ నాన్నకుప్రేమతో లో అద్బుతంగా నటించాడని సెంటిమెంట్ సీన్స్ లో పెర్ఫార్మెన్స్ పీక్స్ అని కొనియాడాడు. కాగా ఈ మధ్యనే రిలీజ్ అయిన సరైనోడు సూపర్ సక్సెస్ తో అల్లుఅర్జున్ ఎంతటి సంతోషంలో ఉన్నాడో అందరికీ తెల్సిందే.

కాగా ఈ మధ్యనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లుఅర్జున్ కి ఫోన్ చేసి సినిమా ఈ మధ్యనే చూశానని అద్బుతంగా చేశావని ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు సూపర్ గా వచ్చాయని మెచ్చుకున్నాడట. దాదాపు 15 నిమిషాలు మాట్లాడుకున్న ఈ ఇద్దరు హీరోలు తమ స్నేహాన్ని మరోసారి చాటుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -